who is this girl besides jagan
జగన్ పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఎక్కడికి వెళ్లినా జనం వేలాదిగా వచ్చి స్వాగతం పలుకుతున్నారు. స్పందనపై వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అంతా అనుకున్న విధంగానే సాగుతుండడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి. అటు జగన్ పాదయాత్రలో ప్రశాంత్ కిషోర్ టీం కూడా చురుగ్గా పనిచేస్తున్నట్లు సమాచారం. యాత్ర వెంబడే ప్రశాంత్ కిషోర్ టీం కూడా ఉంటోంది. పాదయాత్రలో జగన్ ప్రసంగంలో ఏ అంశానికి ఎక్కువగా జనం నుంచి స్పందన వస్తోంది వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. అలాగే హగాన్ మాట్లాడాల్సిన అంశాలు, ఏయే అంశాలు మాట్లాడితే ఎటువంటి స్పందన వస్తోంది అనే అంశాలని ప్రశాంత్ టీం సభ్యులు కెమెరాలతో యాత్రలో పాల్గొంటూ ఆ దృశ్యాలను రికార్డు చేస్తున్నారు. జనంతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. జగన్ యాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారాన్ని కూడా ప్రశాంత్ టీం పర్యవేక్షిస్తోంది. నలుపు రంగు టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు యాత్రలో పాల్గొంటున్నారు. కేవలం యువకులే కాకుండా మహిళా సభ్యులు కూడా ప్రశాంత్ కిషోర్ టీంలో పని...